తార్నాకలో ‘రైతులు.. రాజ్యాంగం’ పై చర్చ.. అందరూ ఆహ్వానితులే

by Mahesh |
తార్నాకలో ‘రైతులు.. రాజ్యాంగం’ పై చర్చ.. అందరూ ఆహ్వానితులే
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గత కొన్నేండ్లుగా లీఫ్స్ సంస్థ భూమి సంవాద్ చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం 5 గంటలకు తార్నాకలో ‘రైతులు.. రాజ్యాంగం’ ('Farmers... Constitution') అనే అంశంపై చర్చను చేపట్టినట్లు లీఫ్స్ సంస్థ(Leafs organization) ప్రధాన కార్యదర్శి జీవన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ ప్రత్యేక చర్చను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమానికి తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, లీఫ్స్ సంస్థ అధ్యక్షుడు భూమి సునీల్, కమిషన్ సభ్యులు, వ్యవసాయ రంగ నిపుణులు, రైతు ప్రతినిధులు హాజరవుతున్నట్లు చెప్పారు. వ్యవసాయం, రైతుల అభ్యున్నతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన చట్టాలు, పథకాలపై చర్చ జరగనున్నది. అలాగే వ్యవసాయంపై బాధ్యత కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల్లో దేనికి ఉన్నదన్న అంశంపై ప్రధానంగా మాట్లాడనున్నారు. చర్చా కార్యక్రమానికి ఎవరైనా హాజరు కావచ్చునన్నారు. చర్చ తార్నాకలోని లీఫ్స్ సంస్థ కార్యాలయంలో ఉంటుంది.

Advertisement

Next Story