పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష

by Kalyani |
పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష
X

దిశ, బడంగ్​ పేట్​ : మైనర్​ బాలికను ప్రేమ పేరుతో వేధించి, లైంగిక దాడికి యత్నించిన నిందితుడికి రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి జీవిత ఖైదుతో పాటు రూ.5వేల జరిమానా విధించారు. బాలాపూర్​ ఇన్ స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం... బాలాపూర్ ఉస్మాన్ నగర్ కు చెందిన మొహమ్మద్ జియాన్ అలియాస్ మొహమ్మద్ ఓమర్ (23)కు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన మైనర్​ బాలికపై కన్నుపడింది. ఈ నేపధ్యంలోనే 2020 లో ప్రేమ పేరుతో సదరు మైనర్ బాలిక వెంట పడ్డాడు. ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక దాడికి యత్నించాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో బాలాపూర్​ పోలీసులు నిందితుడిపై ఫొక్సోచట్టంపై కేసులు నమోదు చేశారు. కేసు పూర్వపరాలను పరిశీలించిన రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి జియాన్ ను దోషిగా నిర్దారించి, రూ.5వేల జరిమానాతో పాటు మూడేళ్ళ జైలు శిక్ష విధించారు. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సునీత వాదనలు వినిపించారు. అంతేగాకుండా బాధితురాలికి రూ. లక్ష రూపాయల నష్టపరిహారాన్ని అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed