Jee-Mains: జేఈఈ-మెయిన్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. దరఖాస్తులో తప్పుల సవరణకు అవకాశం

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-25 16:00:10.0  )
Jee-Mains: జేఈఈ-మెయిన్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. దరఖాస్తులో తప్పుల సవరణకు అవకాశం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు(IIT), ఎన్‌ఐటీ(NIT)ల్లో బీటెక్‌(B.Tech), ఆర్కిటెక్చర్‌(Architecture) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్(Jee-Mains) నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) అక్టోబర్(October)లో విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం రెండు సెషన్లలో జేఈఈ మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఎగ్జామ్స్ జనవరిలో, రెండో సెషన్ ఎగ్జామ్స్ ఏప్రిల్లో జరగనున్నాయి. కాగా మొదటి సెషన్ పరీక్షలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 22తో ముగిసింది. సుమారు 13 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.

అయితే అప్లై చేసే సమయంలో అభ్యర్థులు తమ వివరాలను కొన్ని తప్పుగా నమోదు చేస్తూ ఉంటారు. అయితే దరఖాస్తులో తప్పుల సవరణకు ఎన్‌టీఏ అవకాశం కల్పించింది. విద్యార్థులు https://jeemain.nta.ac.in/ వెబ్‌సైట్‌ ను సందర్శించి తప్పుగా నమోదు చేసిన వివరాలను సవరించుకోవచ్చు. పేరు, డేట్ ఆఫ్ బర్త్, పేరెంట్స్ నేమ్స్, 10th క్లాస్, 12వ తరగతి, పాన్‌కార్డు నంబర్‌, ఎగ్జామ్ సెంటర్ వంటి తప్పులను ఎడిట్ చేసుకోవచ్చు. మొబైల్ నంబర్, ఈ-మెయిల్, ఫోటో, అడ్రస్ మార్చుకునేందుకు అవకాశం లేదు.

Advertisement

Next Story

Most Viewed