మహేష్ తో మూవీ.. అతన్ని దింపుతున్న రాజమౌళి !

by Veldandi saikiran |   ( Updated:2025-04-13 09:15:39.0  )
మహేష్ తో మూవీ.. అతన్ని దింపుతున్న రాజమౌళి !
X

దిశ, వెబ్ డెస్క్: ప్రిన్స్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకుడు రాజమౌళి ( SS Raja mouli) కాంబినేషన్ లో బడా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే SSMB 29 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా కోసం మరో దర్శకున్ని రంగంలోకి దింపుతున్నాడట జక్కన్న. మహేష్ బాబు సినిమా కోసం డైలాగ్ రైటర్ గా దర్శకుడు దేవా కట్టా ( Deva Katta) పని చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ మేరకు రాజమౌళి నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డైలాగ్ పార్ట్ మొత్తం కూడా ఫినిష్ కూడా చేసినట్లు చెబుతున్నారు. మహేష్ బాబుకు తగ్గట్టుగా పవర్ఫుల్ డైలాగులు రాసినట్లు సమాచారం అందుతుంది. గతంలో ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ అలాగే ప్రస్థానం లాంటి సినిమాలకు దర్శకుడిగా దేవా ( Deva Katta ) పనిచేసిన సంగతి తెలిసిందే.

బాహుబలి సినిమా సమయంలో కూడా రాజమౌళికి సహాయం చేశాడు దేవా కట్టా. ఇప్పుడు మళ్లీ రాజమౌళితో జత కడుతున్నాడు. ఇది ఇలా ఉండగా రాజమౌళి అలాగే మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ ఇద్దరి పాత్రలు తప్ప మిగతా పాత్రలపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంఎం కీరవాణి ( MM Keeravani ) ఉంటారని చెబుతున్నారు.



Next Story

Most Viewed