మైనర్ బాలుడు మిస్సింగ్

by Kalyani |
మైనర్ బాలుడు మిస్సింగ్
X

దిశ, చైతన్య పురి : మైనర్ బాలుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంఘటన నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సూర్య నాయక్ తెలిపిన వివరాల ప్రకారం… ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ అక్రమ్ తన తమ్ముడి మోసలీన్ తో కలిసి నాగోల్ జైపురి కాలనీలో నివాసముంటున్నాడు. అక్రమ్ సెలూన్ షాపులో పనిచేస్తుండగా అతని తమ్ముడు ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈనెల 24న ఉదయం 8 గంటల సమయంలో మోసలీన్ టిఫిన్ చేయడానికి బయటికి వెళ్లి ఎంతకీ తిరిగి రాలేదు. అక్రమ్ చుట్టుపక్కల, తనకు తెలిసిన వారి దగ్గర వాకబు చేయగా ఆచూకీ లభించకపోవడంతో సోమవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed