MakeMyTrip: మల్టీ-కరెన్సీ పేమెంట్స్ ఫీచర్ ప్రారంభించిన మేక్‌ మై ట్రిప్

by S Gopi |   ( Updated:2024-11-25 16:42:50.0  )
MakeMyTrip: మల్టీ-కరెన్సీ పేమెంట్స్ ఫీచర్ ప్రారంభించిన మేక్‌ మై ట్రిప్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ మేక్ మై ట్రిప్ టూరిస్టుల కోసం సరికొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది. దేశీయంగా పర్యాటక రంగ అభివృద్ధికి మల్టీ-కరెన్సీ చెల్లింపుల సదుపాయాన్ని తీసుకొచ్చినట్టు కంపెనీ సొమవారం ప్రకటనలో వెల్లడించింది. దీనివల్ల అంతర్జాతీయ టూరిస్టులకు దేశవ్యాప్తంగా సరఫరా నెట్‌వర్క్‌కు నేరుగా కనెక్ట్ చేయడంలో సహాయపడుతుందని, తద్వారా 2,100 నగరాల్లో వసతి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్ ద్వారా దేశీయంగా పర్యటించే విదేశీయులు తమకు అవసరమైన కరెన్సీతో చెల్లింపులు పూర్తి చేయవచ్చని మేక్ మై ట్రిప్ సహ-వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈఓ రాజేష్ మాగో చెప్పారు. కంపెనీ తీసుకొచ్చిన సరికొత్త ఫీచర్‌ను ఉపయోగించి బహ్రెయిన్ దినార్, బ్రిటిష్ పౌండ్, యూరో, అమెరికా డాలర్‌తో సహా ప్రధాన గ్లోబల్ కరెన్సీలను ఉపయోగించే చెల్లింపులు జరుగుతాయని కంపెనీ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed