లంచ్ టైమ్..34 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-17 07:04:05.0  )
లంచ్ టైమ్..34 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా
X

దిశ, వెబ్ డెస్క్ : న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా లంచ్ సమయానికి 6 వికెట్లు కోల్పోయి34 పరుగులు మాత్రమే చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణయం తప్పని అర్ధం కావడానికి ఎంతోసేపు పట్టలేదు. కివీస్ పేస్ బౌలర్ల ధాటికి నలుగురు టాప్ ఆర్డర్ బ్యాటర్లు డకౌట్ కావడం విశేషం. ఆట ప్రారంభం కాగానే స్వల్ప వ్యవధిలో ఓపెనర్ రోహిత్ శర్మ(2) తొలి వికెట్ గా పెవిలియన్ చేరగా, కోహ్లీ, సర్ఫరాజ్ లు డకౌట్ గా వెనుతిరిగారు. ఆ తర్వతా వర్షంతో కొద్దిసేపు ఆగిన ఆట తిరిగి ప్రారంభం కాగానే మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 13పరుగులకు అవుటయ్యాడు. అనంతరం లోకల్ హీరో రాహుల్, జడేజాలు కూడా డకౌట్ అయ్యారు.

లంచ్ సమయానికి రిషబ్ పంత్ (15), అశ్విన్ (0) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. సౌథీ 2, హెన్రీ2, రూర్కీ 3వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్ లో అనారోగ్యంతో ఆడలేకపోయిన శుభమన్ గిల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్, పేసర్ ఆకాశ్ దీప్ స్థానంలో మూడో స్పిన్నర్ గా కుల్ధీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు.

Advertisement

Next Story