PCC chief: గ్రూప్-1పై సాయంత్రంలోగా నిర్ణయం.. కేటీఆర్ కు పీసీసీ సవాల్

by Prasad Jukanti |
PCC chief: గ్రూప్-1పై సాయంత్రంలోగా నిర్ణయం.. కేటీఆర్ కు పీసీసీ సవాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష విషయంలో ఈరోజు సాయంత్రం లోపు నిర్ణయం తీసుకుంటామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. గ్రూప్-1 పరీక్ష వాయిదా వేయాలని, జీవో 29 రద్దు చేసి జీవో55 అమలు చేయడం వంటి తదితర అంశాలపై ఆందోళన చేస్తున్న గ్రూప్-1 అభ్యర్థులతో ఇవాళ గాంధీ భవన్ లో సమావేశం అయిన పీసీసీ చీఫ్ ఈ సందర్భంగా వారి సమస్యలను తెలుసుకున్నారు. అభ్యర్థులు చెప్పిన విషయాలపై అధికారులతో మాట్లాడతామన్నారు. అభ్యర్థులు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత మాది అన్నారు. నిరుద్యోగుల పట్ల కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. పదేళ్లు అధికారంలో ఉన్న మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. మీరిచ్చిన ఉద్యోగాలు 40 వేలు కూడా దాటలేదన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. మేము వచ్చిన 9 నెలల్లోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వస్తున్నామన్నారు. కేసీఆర్ రూ.7.5 లక్షల కోట్లు అప్పు చేసి మా నెత్తిన పెట్టి వెళ్లారని, మిగులు బడ్జెట్ ను అప్పుల పాలు చేశారని దుయ్యబట్టారు. నిరుద్యోగుల పట్ల బీఆర్ఎస్, బీజేపీ నాయకుల చిత్తశుద్ధి ఏంటో నిరుద్యోగులు తెలుసుకోవాలన్నారు.

Advertisement

Next Story