Samantha: ఆయన సపోర్ట్ నాకు ఫుల్‌గా ఉండటం వల్లే బలం చేకూరింది.. సమంత ఆసక్తికర కామెంట్స్

by Hamsa |
Samantha: ఆయన సపోర్ట్ నాకు ఫుల్‌గా ఉండటం వల్లే బలం చేకూరింది.. సమంత ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ఏడాది నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రజెంట్ ఆమె ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే దీనిని రాజ్, డీకే తెరకెక్కిస్తుండగా.. ఇందులో వరుణ్ ధావన్(Varun Dhawan), సమంత జంటగా నటిస్తున్నారు. అయితే ఇది నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది. ఇక రిలీజ్ తేదీ దగ్గర పడటంతో మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. ఇటీవల వచ్చిన సిటాడెల్ ట్రైలర్ ప్రేక్షకుల్లో పాజిటివ్ రెస్పాన్స్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘సిటాడెల్ నిర్మాణంలో మా చుట్టూ మంచి వ్యక్తులు ఉన్నారు అనిపించింది. రాజ్ అండ్ డీకే(Raj and DK) లాంటి సినీ దర్శకుల విజన్, మేకింగ్ చూసిన తర్వాత.. ప్రతీ ఒక్కరు కూడా ఇలాంటి స్పై యూనివర్స్‌లో భాగం కావాలని కోరుకొంటారు. ఈ ప్రాజెక్టుతో సుదీర్ఘమైన జర్నీ కొనసాగింది. ఈ సిరీస్ అవుట్‌పుట్ చూసిన తర్వాత చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాం తప్పకుండా మంచి అనుభూతిని కలిగిస్తుంది. ప్రియాంక చోప్రా చేసిన పాత్రను ఇండియన్ వెర్షన్‌లో చేయాలనే ప్రపోజల్ వచ్చినప్పుడు నేను చాలా ఎక్సైటింగ్ అయ్యాను.

యాక్షన్‌తో కూడిన స్పై సిరీస్ చేయాలని నాకు ఎప్పటి నుంచో కోరిక ఉండేది. ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండే స్పై సిరీస్ చేయడం గొప్ప అనుభూతి. సిటాడెల్: హానీ బన్నీ(Citadel: Honey Bunny) సినిమాలో హీరోయిన్‌కు ప్రాధాన్యత ఉన్నప్పటికీ.. హీరో రోల్ కూడా బ్యాలెన్స్‌గా ఉంటుంది. దర్శకుడు చాలా చక్కగా బ్యాలెన్స్ చేశారు. నా పాత్రకు కొంత వెయిట్ ఉన్నప్పటికీ. .నాకు ఫుల్ సపోర్టుగా వరుణ్ ధావన్ ఉన్నారు. అదే నా పాత్రకు బలంగా మారింది. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే విషయంపై ఎక్సైటింగ్‌గా ఉన్నా’’ అని చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story