Meta lays off: ఉద్యోగులకు షాక్ ఇచ్చిన మెటా..!

by Shamantha N |
Meta lays off:  ఉద్యోగులకు షాక్ ఇచ్చిన మెటా..!
X

దిశ, బిజినెస్ బ్యూరో: కరోనా మహమ్మారి నుంచి టెక్‌ (tech) రంగంలో లేఆఫ్స్‌ (layoffs) జరుగుతూనే ఉన్నాయి. ఆర్థిక మాంద్యం వల్ల గతంలో ఉద్యోగులను తీసేసిన సంస్థలు.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ‌(AI) కారణంగా ఖర్చులు తగ్గించుకునేందుకు విడతల వారీగా ఉద్యోగులను తీసేస్తున్నాయి. అందులో భాగంగానే ఫేస్‌బుక్‌ (Facebook) మాతృసంస్థ అయిన మెటా (Meta) మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, రియాలిటీ ల్యాబ్స్‌ కోసం పనిచేస్తున్న టీమ్‌లతో సహా మెటా వర్స్‌ అంతటా లే ఆఫ్స్‌ను ప్రకటించింది. అయితే, ఎంత మంది ఉద్యోగులను తొలగిస్తుందనే సమాచారాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. రిక్రూటింగ్‌, లీగల్‌ ఆపరేషన్‌.. వంటి వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపైనే ఈ ప్రభావం పడేలా కన్పిస్తోంది.

ఇప్పటికే లేఆఫ్స్

కాగా, మెటా ఇప్పటికే పలుసార్లు ఉద్యోగులకు లేఆఫ్స్‌ ప్రకటించింది. 2022లో ఏకంగా 11 వేల మందిపై వేటు వేసింది. ఇక గతేడాది రెండు విడతల్లో సుమారు 10 వేల మందిని ఇంటికి సాగనంపింది. ప్రస్తుతం, మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్దమయ్యింది. దీంతో, టెక్‌ ఉద్యోగులను కలవరపడుతున్నారు. లేఆఫ్స్‌ గురించి ఇప్పటికే సదరు ఉద్యోగులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed