Priya Bhavani Shankar: 55 రోజులు నటించా.. కానీ నన్ను 5 నిమిషాలు మాత్రమే ఉంచారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by sudharani |   ( Updated:2024-10-17 14:54:03.0  )
Priya Bhavani Shankar: 55 రోజులు నటించా.. కానీ నన్ను 5 నిమిషాలు మాత్రమే ఉంచారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ‘కళ్యాణం కమనీయం’ (Kalyanam Kamaneeyam) సినిమాతో తెలుగు ఇండస్ట్రీ (Industry) ఎంట్రీ ఇచ్చింది ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar). స్కిన్ షో (skin show)కు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ (beauty).. వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రజెంట్ ఇండియన్ త్రీ (Indian 3)లో నటిస్తున్న ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar).. తాజాగా ఓ భేటీలో మాట్లాడుతూ తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది.

‘ఓ పెద్ద హీరో సినిమాలో నాకు ఆఫర్ (offer) వచ్చింది. ఆ చిత్రంలో దాదాపు 55 రోజుల పాటు నటించాను. ఎండనక, వాననక ఎంతో కష్టపడి శ్రమించాను. అయితే.. షూటింగ్ (shooting) పూర్తైన తర్వాత డబ్బింగ్ చెప్పడానికి వెళ్లగా షాక్ అయ్యాను. ఆ సినిమాలో నా పాత్ర కేవలం 5 నిమిషాలు కంటే తక్కువగానే ఉంది. దీంతో నాకు చెప్పిన కథ ఏంటీ, నాతో తీసిన షూటింగ్ అంతా ఏమైందని డైరెక్టర్‌ను అడిగాను. అదంతా మ్యూజిక్ (music)లో వస్తుంది చూడండి అన్నారు. తర్వాత ఆ సినిమాలో నటిస్తున్న హీరోకు కూడా కాల్ చేసి అడిగాను. ‘నాతో 135 రోజులు షూటింగ్ చేశారు, నా సన్నివేశాలే చిత్రంలో లేవు’ అంటూ హీరో బదులు ఇచ్చాడు’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియా భవాని (Priya Bhavani). అయితే.. సినిమా పేరు, డైరెక్టర్, హీరో ఎవరు అనే విషయాలు మాత్రం చెప్పలేదు ఈ బ్యూటీ (beauty). ప్రజెంట్ ప్రియా కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story