- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెక్కుల పంపిణీలో ఇందిరమ్మ కమిటీల గొడవ
దిశ, నెల్లికుదురు : మండల కేంద్రం నెల్లికుదురులో వివిధ గ్రామాలకు చెందిన సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు గురువారం ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ క్రమంలో కొందరు నాయకులు, కార్యకర్తలు ఇందిరమ్మ కమిటీలు ఏకపక్షంగా జరుగుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ కోసం పూర్వం నుంచి కష్టపడి పని చేస్తున్న నాయకులను, కార్యకర్తలను కాదని ఇష్టానుసారంగా కమిటీలో చోటు కల్పిస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. దీంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ… కమిటీలు ఇంకా ఆరంభదశలోనే ఉన్నయని, అపోహలకు పోవద్దని అన్నారు. పార్టీ కోసం పని చేసిన వారు తన గుండెల్లో ఉన్నారని, అందరికీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు.
అయినప్పటికీ కార్యకర్తలు, నాయకులు పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించాలని, మరోసారి ఎమ్మెల్యే చుట్టూ చేరి అడ్డుకున్నారు. ఎవరు అధైర్య పడవద్దు అని ఎమ్మెల్యే చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, సత్యపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి, బాలాజీ నాయక్, నాగరాజు, వెంకటేష్, యాకయ్య, నరేష్, కిషన్ నాయక్, బండారు మల్లయ్య, మల్లేశం, శంకర్, కొయ్యడి ఏకాంతం, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.