రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా..

by Sumithra |
రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా..
X

దమ్మపేట మండలంలో మైనింగ్ మాఫియా ఆగడాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయి. ప్రతిరోజు దమ్మపేట మండలంలోని ఆకినేపల్లి పంచాయతీ పరిధిలోని వెంకటరాజపురం, మందలపల్లి కేంద్రాలుగా ఓవైపు ఎర్రమట్టి, మరోవైపు గుట్టలు గుల్ల చేసి తరలించుకుపోతున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మందలపల్లి గ్రామంలోని గుట్టలు ఇప్పటికే మైనింగ్ మాఫియా దాటికి సుమారు 70 శాతం మాయం అయిపోయాయి, వెంకట్రాజపురం కేంద్రంగా ప్రతిరోజు తెల్లవారుజామున ఎర్రమట్టిని కమర్షియల్ వ్యాపారాలకు తరలిస్తున్నారు. గుట్ట మట్టిని ఒక ట్రాక్టర్ ట్రక్కు రూ. వెయ్యికి అమ్ముకుంటుంటే, ఎర్రమట్టిని సుమారు ఒక్కొక్క ట్రక్కు మట్టి రూ.1600 నుంచి రూ.2వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. భారీ స్థాయిలో మట్టి తరలిపోతున్నా ఇప్పటివరకు ఏ ఒక్క వాహనాన్ని కూడా సీజ్ చేయలేదు. మట్టి తరలించుకుపోతున్న ప్రాంతాలను ఇప్పటివరకు పరిశీలించకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. దిశ, దమ్మపేట

దిశ, దమ్మపేట : దమ్మపేట మండలంలో మైనింగ్ మాఫియా ఆగడాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయి. ప్రతిరోజు దమ్మపేట మండలంలోని ఆకినేపల్లి పంచాయతీ పరిధిలోని వెంకటరాజపురం, మందలపల్లి కేంద్రాలుగా ఓవైపు ఎర్రమట్టి, మరోవైపు గుట్టలు గుల్ల చేసి తరలించకుపోతున్నా.. పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. మందలపల్లి గ్రామంలో ఉన్న గుట్టలు ఇప్పటికే మైనింగ్ మాఫియా దాటికి సుమారు 70 శాతం మాయం అయిపోయాయి, వెంకట్రాజపురం కేంద్రంగా ప్రతి రోజు తెల్లవారుజామున ఎర్రమట్టిని కమర్షియల్ వ్యాపారాలకు తరలిస్తున్నారు. కొన్ని ప్రభుత్వ స్థలాల్లో గుట్ట మట్టిని ఒక ట్రాక్టర్ ట్రక్కు రూ. వెయ్యి రూపాయలకు అమ్ముకుంటుంటే, మరోవైపు వెంకట రాజపురం, కొత్తూరు గ్రామాల కేంద్రంగా తరలిపోతున్న ఎర్రమట్టిని సుమారు ఒక్కొక్క ట్రక్కు మట్టి రూ.1600 నుంచి రూ.2వేల వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.

ప్రభుత్వ ఆదాయానికి గండి.

మట్టి తరలింపునకు ఎటువంటి అనుమతులు తీసుకొని మైనింగ్ మాఫియా రాయుళ్లు, అక్రమంగా మట్టి తరలిస్తూ ప్రభుత్వాదాయానికి గండి పెడుతున్నారు. అటు అధికారులు సైతం మండలంలో భారీ స్థాయిలో మట్టి తరలిపోతున్నా ఇప్పటివరకు ఏ ఒక్క వాహనాన్ని కూడా సీజ్ చేయలేదు. ప్రభుత్వ భూముల నుంచి మట్టి తరలించుకుపోతున్న ప్రాంతాలను సైతం ఇప్పటివరకు పరిశీలించకపోవడం, మట్టినీ తరలించకపోకుండా గుట్టలు ఉన్న ప్రభుత్వ స్థలాలు చుట్టూ ట్రెంచ్ తీయకపోగా, మైనింగ్ మాఫియా దాటికి ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నా, ప్రకృతి సంపద కనుమరుగవుతున్నా అధికారులు చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ మైనింగ్ మాఫీయాని అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

Advertisement

Next Story