- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Communist: గుండెపోటుతో తెలంగాణ కమ్యూనిస్టు నేత కన్నుమూత

దిశ, వెబ్‌డెస్క్/ఖమ్మం టౌన్: తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ(Communist Party)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో సీపీఐ(CPI) ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్(60) కన్నుమూశారు. బుధవారం ఉదయం ఖమ్మంలోని మినీ ట్యాంక్ బండ్‌లో వాకింగ్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు నిర్ధారించారు. ప్రసాద్(Potu Prasad) కమ్యూనిస్టుగా సుదీర్ఘకాలం ప్రజా ఉద్యమాల్లో పనిచేశారు. విషయం తెలిసిన వెంటనే ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు(Kunamneni Sambasiva Rao) స్పందించారు. ప్రసాద్ మరణవార్త విని దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని అన్నారు. అంతేకాదు.. ఆయన మృతిపట్ల స్థానిక నేతలు కూడా నివాళులు అర్పించారు.