మున్సిపల్ కమిషనర్ సరెండర్

by Sridhar Babu |
మున్సిపల్ కమిషనర్ సరెండర్
X

దిశ, జగిత్యాల టౌన్ : జగిత్యాల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సీడీఎంఏకు సరెండర్ చేశారు. ఈమేరకు కలెక్టర్ కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య పరిపాలనకు, ప్రజాప్రతినిధులకు సహకరించలేదని ప్రిన్సిపల్ సెక్రటరీకి రాసిన లేఖలో కలెక్టర్ పేర్కొన్నారు. ఇటీవల అదనపు కలెక్టర్ తో వాగ్వాదానికి దిగిన సంఘటనతో పాటు దసరా వేడుకల్లో బల్దియా ట్రాక్టర్ ను జమ్మి చెట్టు తరలింపునకు ఇవ్వకూడదని సిబ్బందికి అనధికారిక ఆదేశాలు ఇవ్వడంతోనే ఆయనను సరెండర్ చేసినట్లు తెలుస్తోంది.

అంతే కాకుండా ఇటీవల మున్సిపల్ చైర్ పర్సన్ తో పరిపాలనా విషయంలో విభేదాలు, మరోవైపు కౌన్సిలర్, దురుసు ప్రవర్తనపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉండగా గత కొన్నేళ్లుగా జగిత్యాల మున్సిపాలిటీలో కమిషనర్లు తరచూ మారుతుండటం తెలిసిన విషయమే.

Advertisement

Next Story