- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బడ్జెట్ 2025: బీసీ సంక్షేమానికి పెరిగిన బడ్జెట్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ (Annual Budget 2025-26)ను అర్ధిక మంత్రి భట్టి విక్రమార్క (Finance Minister Bhatti Vikramarka) ప్రవేశ పెట్టారు. మొత్తం రూ. 3,04,965 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. 2024-25 తెలంగాణ తలసరి ఆదాయం (Per Capita Income of Telangana) రూ.3,79,751 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లుగా ఉన్నట్లు సూచించారు. అలాగే మూల వ్యయం రూ.36,504 కోట్లు ప్రతిపాదించారు. అలాగే బీసీ సంక్షేమ శాఖ (BC Welfare Department)కు రూ. 11,405 కోట్లు కేటాయించగా.. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వ (BRS Govt) కేటాయింపులతో పోలిస్తే అధికంగా ఉంది. 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం బడ్జెట్ రూ. 2,90,396 కోట్లు ప్రతిపాదించగా అందులో బీసీ సంక్షేమానికి రూ. 6,229 కోట్లు మాత్రమే ప్రతిపాదించింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొట్టమొదటి వార్షిక బడ్జెట్ లో రూ. 11,405 కోట్లను బీసీ సంక్షేమ శాఖకు కేటాయించడం జరిగింది.
బడ్జెట్‌లో కేటాయింపులు
* వ్యవసాయ శాఖ- రూ.24,439 కోట్లు
* పంచాయతీరాజ్ శాఖ- రూ.31,605 కోట్లు
* మహిళా శిశు సంక్షేమ శాఖ- రూ.2,862 కోట్లు
* కార్మిక శాఖ- రూ.900 కోట్లు*
*చేనేత రంగానికి- రూ.371 కోట్లు
*విద్యాశాఖ- రూ.23,108కోట్లు*
*ఎస్టీ సంక్షేమం- రూ.17,169 కోట్లు
* పశు సంవర్ధక శాఖ- రూ.1,674 కోట్లు
*పౌరసరఫరాల శాఖ- రూ.5,734 కోట్లు*
*ఎస్సీ సంక్షేమం: రూ 40,232 కోట్లు*
*పరిశ్రమల శాఖ- రూ.3,527 కోట్లు
* బీసీ సంక్షేమం- 11,405 కోట్లు
*మైనార్టీ సంక్షేమ శాఖ- రూ.3,591 కోట్లు
*ఐటీ రంగం- రూ.774 కోట్లు
Read More..
బడ్జెట్ లో ఆరు గ్యారెంటీలకు పెద్దపీట వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం