- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌కి టూలెట్ బోర్డు.. మాజీసీఎం తీరుపై సర్వత్రా విమర్శలు

దిశ, వెబ్ డెస్క్: గజ్వేల్ నియోజకవర్గం (Gajwel Constituency) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం (MLA Camp Office) వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి బీజేపీ నేతలు (BJP Leaders) "టూలెట్ ఫర్ గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్" (Tolet For MLA Camp Office) అనే బోర్డు తగిలించారు. అంతేగాక 'వాంటెడ్ గజ్వేల్ ఎమ్మెల్యే" (Wanted Gajwel MLA)బోర్డు కూడా ఏర్పాటు చేసి, నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు.
అంతేగాక కేసీఆర్ డౌన్, డౌన్ అని, కేసీఆర్ బయటికి రావాలి అని పలు నినాదాలు చేసుకుంటూ వాంటెడ్ గజ్వేల్ ఎమ్మెల్యే అనే ఫ్లకార్డులను ప్రదర్శించారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో బీజేపీ నేతలు, పోలీసులకు మధ్య స్వల్ప ఉద్రిక్తత (High Tension) చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్ చేసి, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ నుంచి తరలించారు. కాగా గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (Former CM KCR) తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఏర్పడిన నాటి నుంచి ఎర్రవల్లిలోని తన ఫాంహౌజ్ కే (Erravalli Form House) పరిమితయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రతిపక్ష నేతగా (Opposition Leader) ఉన్న ఆయన.. కేవలం రెండు సార్లు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు (Assembly Meetings) వచ్చారు. అది కూడా గవర్నర్ ప్రసంగానికి (Governor Speech) మాత్రమే హాజరయ్యారు. అలాగే గజ్వేల్ లో సుదీర్ఘ కాలంగా ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్.. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు కూడా అందుబాటులో ఉండటం లేదని టాక్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి, ఫాంహౌజ్ కే అంకితం కావడం ఏంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read More..
తెలంగాణ వార్షిక బడ్జెట్‌పై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు