గవర్నర్ చేతుల మీదుగా డా.సుబ్రహ్మణ్యంకు ప్రతిష్టాత్మక అవార్డు

by srinivas |
గవర్నర్ చేతుల మీదుగా డా.సుబ్రహ్మణ్యంకు ప్రతిష్టాత్మక అవార్డు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పాలియేటివ్ కేర్ రంగంలో అవిశ్రాంత కృషికి గుర్తింపుగా, రోటరీ ఇంటర్నేషనల్ యొక్క ప్రతిష్టాత్మక ‘సర్వీస్ అబోవ్ సెల్ఫ్ అవార్డు’ను హైదరాబాద్‌ బంజారా హిల్స్ రోటరీ క్లబ్ నుంచి డాక్టర్ సుబ్రహ్మణ్యంకు ఆదివారం ప్రధానం చేశారు. ఈ అవార్డును గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా డా. సుబ్రహ్యణ్యం అందుకున్నారు. ఈ అవార్డు రోటేరియన్లలలో ప్రపంచవ్యాప్తంగా 150 మంది వ్యక్తులకు మాత్రమే ఇవ్వబడుతుందని బంజార హిల్స్ రోటరి నిర్వాహకులు వెల్లడించారు. రెయిన్‌బో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌తో అనుబంధంగా అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, హైదరాబాద్‌లో ఒక ప్రత్యేక పాలియేటివ్ కేర్ సెంటర్ స్పార్ష్ హాస్పిస్‌ను స్థాపించడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. ఆహారం, మందులు, వసతి, వైద్య సంరక్షణతో సహా అన్ని సేవలు పూర్తిగా ఉచితంగా అందించబడుతున్నాయని తెలిపారు. 2011లో ప్రారంభమైనప్పటి నుండి, స్పార్ష్ హాస్పిస్ 13,000 మందికి పైగా రోగులకు సేవలందించిందని, ప్రతిరోజూ దాదాపు 6000 మంది రోగులకు పాలియేటివ్ కేర్‌ను అందిస్తోందని రోటరి క్లబ్ బంజారా హిల్స్ నిర్వహకులు వెల్లడించారు. డాక్టర్ సుబ్రహ్మణ్యంకు అవార్డు ఎంపిక అతని అంకితభావం, రోటరీ యొక్క నిజమైన స్ఫూర్తికి ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు

Next Story