- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
డంపింగ్ యార్డ్ వల్ల ఆవేదన.. గుండె పోటుతో వ్యక్తి మృతి

దిశ, గుమ్మడిదల :- డంపింగ్ యార్డ్ స్థాపన కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ ప్రజల వివరాల ప్రకారం.. నల్లవల్లికి చెందిన నడిమింటి కృష్ణ (53) గత కొన్ని రోజులుగా డంపింగ్ యార్డ్ వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ, రజక సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలో కూడా పాల్గొన్నారు. పారనగర్ శివారులో డంపింగ్ యార్డ్ ఏర్పాటవుతోందన్న వార్త వెలువడినప్పటి నుంచి కృష్ణ తీవ్ర ఆందోళనకు గురయ్యారని గ్రామస్తులు తెలిపారు.
భూమిని అమ్మి కూతురి పెళ్లి చేయాలనుకున్నా...
కృష్ణ తన కూతురి పెళ్లి కోసం కొంత భూమిని అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు కొనుగోలుదారులను సంప్రదించినా, గ్రామ పరిధిలో డంపింగ్ యార్డ్ నిర్మాణం జరుగుతుందని తెలిసిన తర్వాత భూమికి డిమాండ్ తగ్గిపోయిందని తెలిపారు. దీంతో తీవ్ర ఆవేదనలో ఉన్న ఆయన ఆదివారం ఒక్కసారిగా గుండె నొప్పితో కుప్పకూలిపోయారు. తక్షణమే కుటుంబ సభ్యులు నరసాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన హార్ట్ ఎటాక్‌తో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
గ్రామ ప్రజల ఆగ్రహం – డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని డిమాండ్
కృష్ణ మృతికి డంపింగ్ యార్డ్‌నే కారణంగా గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు – మహేశ్వరి (18), మమత (15) ఉన్నారని.. తక్షణమే డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని రద్దు చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.