Achievements Of Megastar Chiranjeevi: మెగాస్టార్ అందుకున్న 6 అవార్డులు ఇవే!

by Anjali |
Achievements Of Megastar Chiranjeevi: మెగాస్టార్ అందుకున్న 6 అవార్డులు ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్: రీసెంట్‌గానే మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) యూకే పార్లమెంట్‌లో లైఫ్ టైమ్ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చిరు మరో అరుదైన ఘనత సాధించడంతో తెలుగు ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపించారు. అయితే చిరు మొత్తం ఎన్ని అవార్డులు అందుకున్నారని తాజాగా సోషల్ మీడియాలో జనాలు చర్చించుకుంటున్నారు.

కాగా మెగాస్టార్ చిరంజీవి కి వచ్చిన ప్రతిష్టాత్మకమైన అవార్డులు చూసినట్లైతే.. 2006 లో ఆంధ్ర యూనివర్సిటి నుంచి డాక్టరేట్ అందుకున్నారు. అలాగే 2006 లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్ అవార్డు (Padma Bhushan Award) సొంతం చేసుకోగా.. 2022 సంవత్సరంలో ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు.

వీటితో పాటుగా.. 2024 లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ విభూషణ్ అవార్డు (Padma Vibhushan Award)దక్కించుకున్నారు. ఇక 2024 లో మోస్ట్ ప్రోలిఫిక్ ఫిలిం స్టార్ ఇన్ ఇండియన్ సినిమా – గిన్నిస్ వరల్డ్ రికార్డు – 45 సంవత్సరాల్లోనే, 156 సినిమాలలో, 537 పాటలలో, 24 వేల డాన్స్ మూవ్స్.. ఇక 2025 లో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు (Lifetime Achievement Award) యూకే పార్లమెంట్‌లో అందుకున్నారు.

ప్రస్తుతం కూడా మెగాస్టార్ చిరంజీవి అనేక చిత్రాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ ఏజ్‌లో కూడా అదిరిపోయే స్టెప్పులేస్తున్నారు. ప్రస్తుతం చిరు విశ్వంభర (Visvambhara)సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాది మే 9 వ తారీకున విశ్వంభర ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పలు పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ హైప్ పెంచాయి.

Next Story

Most Viewed