మినీ లిఫ్ట్ నిర్మాణ పనికి స్థల పరిశీలన..

by Sumithra |
మినీ లిఫ్ట్ నిర్మాణ పనికి స్థల పరిశీలన..
X

దిశ, వీపనగండ్ల : మండల కేంద్ర సమీపంలోని ఊర చెరువు, భీమ కాలువ నుంచి గట్టు పై ఉన్న పొలాలకు సాగునీరు అందించేందుకు మినీ లిఫ్ట్ నిర్మాణానికి జూరాల అధికారులు పరిశీలన చేశారు. గుట్ట పై ఎన్నో సంవత్సరాలుగా బిల్లుగా ఉన్న పొలాలకు సాగునీరు అందించాలని రైతులు పలుమార్లు అధికారులకు విన్నవించారు. అలాగే రైతుబంధు సమితి మాజీ మండల అధ్యక్షుడు ఎత్తం కృష్ణయ్య రైతులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి నిధులు మంజూరు చేయించాలని కోరారు. ఎట్టకేలకు అధికారులు స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు నాగేంద్రం, నాగ హర్షిత్, జాషువా, తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed