- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MP Chamala : మాకు కొలువులు వచ్చే వరకు ఏ నియామకాలు జరుగొద్దు! కేటీఆర్‌పై ఎంపీ చామల సెటైర్లు
దిశ, డైనమిక్ బ్యూరో: ఈనెల 21 నుంచి జరిగే గ్రూప్-1 మెయిన్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అశోక్‌నగర్‌లో బుధవారం అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి ధర్నా చేసిన విషయం తెలిసిందే. అకోశ్‌నగర్ దద్దరిల్లిందని బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంపై ఎక్స్‌లో పోస్ట్ చేసింది. మరోవైపు వారికి మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభ్యర్థులను కలవనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కేటీఆర్‌పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గురువారం ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు.
‘దద్దరిల్లిపోవాలి అంతే.. అస్సలు ఎగ్జామ్స్ పెట్టుడేంటి? వాయిదాలు లేకుండా కేసులు లేకుండా.. లీకులు లేకుండా.. మాకే కోలువులు పోయినాయి, ఇప్పుడు కోలువుల అవసరం ఏంటి? బరాబర్ వాయిదా వేయాల్సిందే మాకు కోలువులు వచ్చే వరకు ఏ కొలువులు జరుగకుండా చూసే బాధ్యత మాది.. ఉద్యమం చేస్తాం.. అంతేనా కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ’ అంటూ కేటీఆర్‌కు ఎక్స్ వేదికగా ట్యాగ్ చేశారు.