- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉప్పల్ స్టేడియంలో నిధుల గోల్‌మాల్ వ్యవహారంలో ఈడీ దూకుడు.. 3 కంపెనీలకు నోటీసులు
దిశ, వెబ్‌డెస్క్: ఉప్పల్ స్టేడియంలో నిధుల గోల్‌మాల్ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దూకుడు పెంచింది. ఈ నెల 8న హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌ను విచారించిన ఈడీ ఆయన స్టేట్‌మెంట్ ఆధారంగా మూడు కంపెనీలకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు రావాలని ఆయా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. స్టేడియం కోసం కొనుగోలు చేసిన జనరేటర్స్, జిమ్ పరికరాలు, క్రికెట్ బాల్స్, ఇతర వస్తువులకు సంబంధించి జరిగిన గోల్‌మాల్ వ్యవహారంలో ప్రశ్నించేందుకు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొంది.
మార్చి 2020 – ఫిబ్రవరి 2023 మధ్య నిధుల దుర్వినియోగం జరిగిందని, ఆ సమయంలో అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్ ప్రైవేట్ పార్టీలతో కుమ్మక్కయి క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్, జిమ్ పరికరాల కొనుగోళ్ల డీల్స్ అప్పగించారని ఈ మధ్య హెచ్‌సీఏ ఆరోపణలు చేయడంతో రంగంలోకి దిగిన ఈడీ.. మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఇదే విషయంలో ఈ నెల 8న అజారుద్దీన్ 9 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ అధికారులు.. డిజిటల్ పరికరాలు, నేరారోపణ పత్రాలు, లెక్కల్లో చూపని నగదుకి సంబంధించి ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. డిజిల్ జనరేటర్స్, ఫైర్ సేఫ్టీ సిస్టం, క్యానోపీల సేకరణ కోసం కేటాయించిన రూ.20 కోట్ల నిధుల దుర్వినియోగంపైనా ఆరా తీసినట్లు సమాచారం.