- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Devendra Fadnavis: మహా సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్!
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర ముఖ్యమంత్రి(Maharashtra CM)పై బీజేపీ హైకమాండ్(BJP High Command) ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis)నే సీఎంగా చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ నేతలు ఇద్దరు తెలిపారు. ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde), అజిత్ పవార్(Ajith Pawar)లను డిప్యూటీ సీఎంలుగా చేయాలని ప్రతిపాదించినట్టు వివరించారు. ఈ ప్రతిపాదనలకు శివసేన, ఎన్సీపీలు అంగీకారం కూడా తెలిపాయని వివరించారు. ఇందుకు సంబంధించి అధికార ప్రకటన ఇంకా వెలువడలేదు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె పెళ్లికి హాజరు కావడానికి దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం ఉదయమే ఢిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆయన సీఎం సీటు విషయమై మాట్లాడినట్టు తెలిసింది. ఈ నెల 28 లేదా 29వ తేదీల్లో ప్రమాణ స్వీకారం ఉండొచ్చని చెబుతున్నారు. సీఎం ఎవరనేది తేల్చడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం ముంబయికి రానున్నారు. కాగా, తమకు ఎలాంటి ప్రతిపాదన అందలేదని, సీఎం ఎవరనేదానిపైనా ఆమోదం తెలుపలేదని శివసేన ఈ ప్రచారాన్ని ఖండిచింది. సీఎం సీటు కోసం పట్టుబడుతున్న ఏక్‌నాథ్ షిండే ఈ ప్రచారంతో అసంతృప్తికి గురైనట్టు తెలిసింది.
బిహార్ మాడల్:
శివసేన ప్రతినిధి నరేష్ మాస్కే మాట్లాడుతూ.. మహారాష్ట్రలోనూ బిహార్ మాడల్ అమలు చేయాలని పేర్కొన్నారు. బిహార్‌లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా తక్కువ సీట్టున్న జేడీయూ నేత నితీశ్ కుమార్‌కు సీఎం పదవి అప్పగించారని, ఇక్కడా అదే పాటించాలన్నారు. ఇక్కడ ఏక్‌నాథ్ షిండే సీఎం కావాలని, తద్వార బీజేపీ గెలిచిన తర్వాత తోటిపార్టీకి విలువ ఇవ్వదనే అపవాదుకు బ్రేక్ వేయాలని సూచించారు. సీఎం సీటును దేవేంద్ర ఫడ్నవీస్ అలంకరిస్తే డిప్యూటీలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లు ఉంటారని, శివసేనకు 12 మంత్రి పదవులు, ఎన్సీపీకి పది మినిస్టర్ బెర్త్‌లు ఇవ్వొచ్చని, మిగిలిన 21 మంత్రి పదవులు బీజేపీ తన వద్దే ఉంచుకోవచ్చని విశ్వసనీయవర్గాల సమాచారం. అందులోనూ హోం, ఫైనాన్స్ వంటి ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోలు తమ వద్దే ఉంచుకోవాలని బీజేపీ ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది.
26లోపే ప్రభుత్వం కొలువుదీరాలా?
మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నేటితో(నవంబర్ 26) ముగుస్తున్నది. ఇంతలోపు ప్రభుత్వం ఏర్పడకుంటే అర్ధరాత్రి నుంచి రాష్ట్రపతి పాలన అమల్లోకి వస్తుందనే ప్రచారం ఉన్నది. ఈ వాదనలపై నిపుణులు మాట్లాడుతూ ఆ ప్రచారం సత్యం కాదని, నవంబర్ 26లోపే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే రాజ్యాంగబద్ధ బాధ్యత ఏమీ లేదని వివరించారు. గతంలో కూడా అసెంబ్లీ గడువు ముగిసిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన ఘటనలు ఉన్నాయని చెబుతున్నారు. 2004 అక్టోబర్ 19వ తేదీతో అసెంబ్లీ ముగియగా నవంబర్ 1వ తేదీన కొత్త సీఎం ప్రమాణం తీసుకున్నారు. 2009 నవంబర్ 3న 11వ అసెంబ్లీ ముగియగా.. కొత్త సీఎం నవంబర్ 7వ తేదీన ప్రమాణం చేశారు.12వ అసెంబ్లీ 2014 నవంబర్ 8న ముగిసిపోతే 13వ అసెంబ్లీ 2014 అక్టోబర్ 31న కొలువుదీరింది. 2019 నవంబర్ 9వ తేదీన 13వ అసెంబ్లీ గడువు ముగిస్తే.. 14వ అసెంబ్లీ సీఎం నవంబర్ 28వ తేదీన ప్రమాణం చేశారు.