Harish Rao: గుజరాత్ కు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతా?.. తెలంగాణ పత్తికి ఎంఎస్పీపై హరీశ్ రావు

by Prasad Jukanti |
Harish Rao: గుజరాత్ కు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతా?.. తెలంగాణ పత్తికి ఎంఎస్పీపై హరీశ్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పంటలకు కల్పించే కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ‘వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్, వన్ నేషన్ వన్ మార్కెట్’ అంటూ ఊదరగొట్టే కేంద్ర ప్రభుత్వం ‘వన్ నేషన్.. వన్ ఎమ్ఎస్పీ’ అని ఎందుకు ఇవ్వడం లేదని ఇవాళ ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. గుజరాత్ పత్తికి మద్దతు ధర క్వింటాకు రూ.8,257 చెల్లిస్తున్న కేంద్రం ప్రభుత్వం తెలంగాణ పండిస్తున్న పత్తికి మాత్రం రూ.7,521 మాత్రమే చెల్లించడం దుర్మార్గం అన్నారు. గుజరాత్‌కు ఒక నీతి, తెలంగాణకు మరో నీతా? అని ప్రశ్నించారు. పత్తికి కేంద్రం చెల్లించే మద్దతు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఎందుకు ఉందని నిలదీశారు. ‘వై నాట్ వన్ నేషన్.. వన్ ఎంఎస్పీ’ అని ప్రశ్నించారు.

👉 Dishadaily Web Stories

Advertisement

Next Story