దుల్కర్ సల్మాన్‌తో రొమాన్స్ చేయబోతున్న అల్లు అర్జున్ బ్యూటీ.. ఈ భామ క్రేజ్ మామూలుగా లేదంటున్న ఫ్యాన్స్

by Kavitha |
దుల్కర్ సల్మాన్‌తో రొమాన్స్ చేయబోతున్న అల్లు అర్జున్ బ్యూటీ.. ఈ భామ క్రేజ్ మామూలుగా లేదంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: ‘ఒక లైలా కోసం’(Oka Laila Kosam) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రంలో తన అందం, అభినయం, నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ‘అలా వైకుంఠపురంలో’(Ala Vaikuntapuramlo) మూవీతో బుట్టబొమ్మగా మారిపోయింది. అయితే సినిమాల పరంగా చాలా చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు.

దీంతో అవకాశాలు రావడం తగ్గిపోయాయి. అంతేకాకుండా ‘ఐరన్ లెగ్’ అనే బిరుదు కూడా తెచ్చుకుంది. అలా కొన్ని మంత్స్ సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ.. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 4 సినిమాల్లో నటించేస్తోంది. ఈ క్రమంలో ఈ భామకు సంబంధించిన ఓన్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) మరోసారి టాలీవుడ్ దర్శకుడితో మరో సినిమా చేయబోతున్నాడు.

దుల్కర్ సల్మాన్ మళ్లీ తెలుగులో డెబ్యూ డైరెక్టర్ రవి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మించబోతున్నారట. ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే నటించనుందనే టాక్ నడుస్తుంది. అంతేకాకుండా కథ నచ్చడంతో దాదాపు ఈ మూవీలో హీరోయిన్‌గా నటించడానికి ఓకే చెప్పేసినట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పూజా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ బుట్ట బొమ్మ క్రేజ్ మామూలుగా లేదుగా అని కామెంట్స్ చేస్తున్నారు.

కాగా 2012లో ‘సెకండ్ షో’(Second Show) చిత్రంతో దుల్కర్ తన సినీ కెరీర్‌ను స్టార్ట్ చేయగా.. ఆ తర్వాత విడుదలైన ‘ఉస్తాద్ హోటల్’(Usthad Hotel) సినిమా అభిమానుల మదిలో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. ఇక ఇటీవలే దుల్కర్ ‘లక్కీ భాస్కర్’(Lucky Bhaskar) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) హీరోయిన్‌గా నటించింది. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. గత ఏడాది దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు జీవీ ప్రకాష్(GV Prakash) సంగీతం అందించగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా సంయుక్తంగా నిర్మించాయి.


Next Story

Most Viewed