Srisailam: వరుస సెలవులు.. శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

by D.Reddy |
Srisailam: వరుస సెలవులు.. శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి (Srisailam Mallikarjuna Swamy Temple) భక్తుల రద్దీ పెరిగింది. రెండో శనివారం, ఆదివారం కావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు (The devotees) శ్రీశైల క్షేత్రానికి పోటెత్తారు. దీంతో ఆదివారం స్వామి అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్స్ లో దర్శనం కంపార్టుమెంట్లలో బారులు తీరారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. అలాగే, ఆలయ అధికారులు కేవలం స్పర్శ దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, మంచినీరు అందిస్తున్నారు.

కాగా, శనివారం ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీశైల క్షేత్రంలో స్వామి అమ్మవార్లకు అత్యంత వైభవంగా స్వర్ణరథోత్సవం నిర్వహించారు.. భక్తుల కోలాటాలు, భజనలు, స్వామి వార్ల కీర్తనలతో ఆలయ ప్రాంగాణం మారుమ్రోగింది. అయితే ప్రతీమాసం ఆరుద్ర నక్షత్రం రోజు ఈస్వర్ణరథోత్సవాన్ని నిర్వహిస్తామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు.



Next Story