Dil Raju : ఫ్లాప్ అయినా హిట్ పోస్టర్స్ పడతాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన దిల్ రాజు

by Prasanna |   ( Updated:2025-02-02 02:54:45.0  )
Dil Raju : ఫ్లాప్ అయినా హిట్ పోస్టర్స్ పడతాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన  దిల్ రాజు
X

దిశ, వెబ్ డెస్క్ : గత కొద్దీ రోజుల నుంచి సినీ ఇండస్ట్రీలో ఫేక్ కలెక్షన్స్ హవా నడుస్తుంది. అభిమానుల కోసం నిర్మాతలు కొన్ని పెద్ద సినిమాలకు ఫేక్ కలెక్షన్స్ వేస్తున్నారని అంతా భావిస్తున్నారు. ఇక, కొంతమంది అయితే దీనిని డైరెక్ట్ గా చెప్పలేక ఇన్ డైరెక్ట్ గా అవును అనే అంటున్నారు. ఫ్యాన్స్ ని మెప్పించడానికి, జనాల్ని థియేటర్స్ కి రప్పించడానికే ఇలా చేస్తున్నారని అంటున్నారు.

ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన పుష్ప 2, దేవర, గేమ్ ఛేంజర్ ( Game Changer ) మూవీస్ కి ఫేక్ కలెక్షన్స్ వేశారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. వీటిపై నిర్మాతలు కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరూ మాట్లాడలేదు. అయితే, తాజాగా " సంక్రాంతికి వస్తున్నాం " మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ప్రెస్ మీట్ జరిగింది. అనిల్ రావిపూడి - వెంకటేష్ కాంబోలో వచ్చిన " సంక్రాంతికి వస్తున్నాం " సినిమా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. తక్కువ బడ్జెట్ లో నిర్మించిన ఈ మూవీ ఇప్పటికే రూ. 270 కోట్ల గ్రాస్ దాటి రూ. 300 కోట్లకు పరిగెడుతుంది.

" సంక్రాంతికి వస్తున్నాం " ( Sankranthiki Vasthunam ) మూవీ డిస్ట్రిబ్యూటర్లకి ట్రిపుల్ ప్రాఫిట్స్ వచ్చాయని తెలిపారు. అయితే, ఈ ఈవెంట్లో దిల్ రాజు ( Dil Raju ) ఫేక్ కలెక్షన్స్ పై మాట్లాడుతూ.. " బ్రేక్ ఈవెన్ అయితేనే సూపర్ హిట్ అని అందరూ చెప్పుకుంటారు. మేము నష్టపోయినప్పుడు కూడా సూపర్ హిట్ పోస్టర్స్ పడతాయి. ఇది వరకు వేరు.. కానీ, ఇప్పుడు కల్చర్ మొత్తం మారిపోయింది. సినిమా ఇండస్ట్రీలో 10 శాతమే సక్సెస్ రేట్. 90 శాతం ఇక్కడ నష్టాలే ఉన్నాయి. ఇటీవల ఐటీ రైడ్స్ జరిగినప్పుడు 90 శాతం ఫ్లాప్స్ అని 2024 ఏడాది షీట్ చూపించాం. ఇన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నా ఎందుకు తీస్తున్నారని అడిగారు " అంటూ చెప్పుకొచ్చాడు.

ఇదే ప్రెస్ మీట్ లో సీనియర్ డిస్ట్రిబ్యూటర్ మాట్లాడుతూ.. " సినిమా కలెక్షన్స్ గురించి మేము నిజాలు చెప్పకూడదు. మా డిస్ట్రిబ్యూటర్స్ దరిద్రం అదే. నిజాలు చెప్తే నెక్స్ట్ సినిమా ఇవ్వరు. మేము బయటకెళ్లి ఎక్కడా మాట్లాడకూడదు. మేము డబ్బులు పోగొట్టుకున్నా పోయామని చెప్పకూడదు. జనాలు కలెక్షన్స్ చూసి నవ్వుకుంటున్నారని " అని అన్నారు. దీంతో దిల్ రాజు, డిస్ట్రిబ్యూటర్స్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.


Next Story

Most Viewed