షాకింగ్ న్యూస్.. చనిపోతూ ఐదుగురికి పునర్జన్మనిచ్చిన మహిళ.. ఎక్కడంటే?

by Anjali |
షాకింగ్ న్యూస్.. చనిపోతూ ఐదుగురికి పునర్జన్మనిచ్చిన మహిళ.. ఎక్కడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: అన్ని దానాల్లో కన్న అన్నదానం గొప్పది. చనిపోయాక మనిషి తన శరీరంలోంచి 200 అవయవాలు, టిష్యూలను దానం చేయవచ్చు. కళ్లు, గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, క్లోమం, పెద్ద, చిన్నపేగులు, ఎముకలు, దానం చేయవచ్చు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సగటున ఆరేడుగురికి బతుకించవచ్చు. తాజాగా ఓ మహిళ చనిపోతూ ఐదుగురికి ప్రాణం పోసింది. హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మిదేవమ్మ అనే మహిళ మరణించింది. తన తల్లి మరణం మరో ఐదుగురికి పునర్జన్మనిస్తుందని తెలుసుకున్న లక్ష్మిదేవమ్మ కుటుంబసభ్యులు ఆమె అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చారు. లక్ష్మిదేవమ్మ రెండు కిడ్నీలు, కాలేయం అండ్ రెండు నేత్రాలను దానం చేసినట్లు జీవన్ దాన్ సోషల్ మీడియా వేదికన తెలియజేశారు. అన్ని దానాల్లో కంటే అవయవాదం గొప్పది కానీ చాలా మంది అవయవదానం చేసేందుకు ముందుకురారు. దీంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed