SRH Vs GT : ఉప్పల్ మ్యాచ్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చేసిన హెచ్‌సీఏ

by Rajesh |
SRH Vs GT : ఉప్పల్ మ్యాచ్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చేసిన హెచ్‌సీఏ
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ ల మధ్య కీలక మ్యాచ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే కాసేపటి క్రితం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో ఈ మ్యాచ్ నిర్వహణపై ఫ్యాన్స్ లో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే తాజాగా హెచ్‌సీఏ ఉప్పల్ మ్యాచ్‌పై కీలక అప్ డేట్ ఇచ్చింది. మ్యాచ్ నిర్వహణకు రాత్రి 10.30 గంటల వరకు సమయం ఉన్నట్లు పేర్కొంది. వర్షం నీళ్లను పూర్తిగా డ్రైనౌట్ చేసి గ్రౌండ్ ను సిద్ధం చేసేందుకు 100 మందికి పైగా తీవ్రంగా శ్రమిస్తున్నారని పేర్కొంది. హెచ్ సీఏ సిబ్బంది, ఫ్యాన్స్ నిరుత్సాహ పడవద్దు అని హెచ్ సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు గురువారం వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed