- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సగం మంది డుమ్మా.. MLC ఉప ఎన్నికకు ముందు బీఆర్ఎస్‌కు కొత్త తలనొప్పి..!
దిశ, తెలంగాణ బ్యూరో: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం సిట్టింగ్ స్థానం కావడంతో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గెలిచేందుకు వ్యూహాలను రచిస్తుంది. అయితే మరో పదిరోజులు మాత్రమే పోలింగ్‌కు గడువు ఉండటంతో ప్రతి ఓటరును కలిసే పనిలో నిమగ్నమైంది. కానీ ఆదిలోనే బీఆర్ఎస్‌లో నిరసన గళం మొదలైంది. పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని 130 మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు హాజరుకావాలని సమాచారం ఇచ్చారు. కానీ బుధవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశానికి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు గైర్హాజరయ్యారు.
కేవలం 60మంది మాత్రమే హాజరైనట్లు సమాచారం. పార్టీ అధిష్టానం విధిగా హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చినా బేఖాతర్ చేశారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 34 మంది ఎమ్మెల్యే స్థానాలు ఉండగా అందులో భద్రాచలం, స్టేషన్ ఘన్ పూర్, జనగాం, సూర్యాపేట సెగ్మెంట్లలో మాత్రమే విజయం సాధించింది. వీరిలో భద్రాచలం, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా, ఇద్దరు జనగాం, సూర్యాపేటకు చెందిన వారు మాత్రం బీఆర్ఎస్‌లో ఉన్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు జి.జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీలు రవీందర్‌రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బసవరాజు సారయ్య, కార్పోరేషన్ మాజీ ఛైర్మన్లు వాసుదేవరెడ్డి, నాగూర్ల వెంకటేశ్వర్లు, యాదవరెడ్డి, నాయకులు బొల్లం సంపత్ కుమార్, వై. సతీష్ రెడ్డి తదితరులు రాలేదు. ఖమ్మం నుంచి మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, ఉపేందర్‌రెడ్డి తదితరులు కూడా ఈ సమావేశానికి రాలేదు. ఉమ్మడి నల్లగొండ నుంచి మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్ గౌడ్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, పలువురు సీనియర్ నేతలు దూరంగా ఉన్నారు.
అభ్యర్ధి ఎంపిక సమయంలో సంప్రదించలేదని, పల్లా రాజేశ్వర్ రెడ్డి, జగదీష్ రెడ్డి ఏకపక్ష ధోరణి, అభ్యర్థి ఎంపికపై ఉన్న అసంతృప్తి వల్లే ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు కీలక నేతలు హాజరుకాకపోవడం పార్టీలో సర్వత్రా చర్చనీయాంశమైంది. పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. అయితే సమస్యను పరిష్కరిస్తారా..? లేకుంటే చూసిచూడనట్లుగానే వ్యవహరిస్తారా అనేది హాట్ టాపిక్‌గా మారింది. సిట్టింగ్‌ను నిలుపుకోవాలంటే నేతలను కలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.