మంథనిలో బహుజన రాగం.. జెడ్పీ చైర్మన్​ పుట్ట మధు భారీ వ్యూహం

by Rajesh |
మంథనిలో బహుజన రాగం.. జెడ్పీ చైర్మన్​ పుట్ట మధు భారీ వ్యూహం
X

వచ్చే శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి బీఆర్​ఎస్​ పార్టీ హ్యాట్రిక్​ సాధించాలని భావిస్తోంది. తెలంగాణ వచ్చిన నాటి నుంచి అధికారంలో ఉన్న పార్టీగా బీఆర్​ఎస్ పేదల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ పలువురు నేతలు జనంలోకి వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీకి పట్టం కట్టి సంక్షేమ పథకాలను కొనసాగించాలని ఓటర్లను కోరుతున్నారు. రాష్ర్టంలో బీఆర్​ఎస్​ టికెట్​ ఆశిస్తున్న వారంత ఓటర్ల వద్ద కేసీఆర్, పార్టీని లేవనెత్తుతుంటే మంథని బీఆర్​ఎస్​ టికెట్​ ఆశిస్తున్న, ప్రస్తుత పెద్దపల్లి జెడ్పీ చైర్మన్​ పుట్ట మధు మాత్రం నియోజకవర్గంలో బహుజన రాగం వినిపిస్తున్నారు. ​పాల్గొన్న ప్రతి సమావేశంలో పార్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాల కంటే అగ్రవర్ణాల అధిపత్యానికి అడ్డుకట్టవేసి బహుజనులకు అధికారం ఇవ్వాలని కోరుతున్నారు. పుట్ట మధు బహుజన వాదానికి ప్రాధాన్యం ఇవ్వడం అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

దిశ, కరీంనగర్​ బ్యూరో : వచ్చే శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి బీఆర్​ఎస్​ పార్టీ హ్యాట్రిక్​ సాధించాలని భావిస్తోంది. తెలంగాణ వచ్చిన నాటి నుంచి అధికారంలో ఉన్న పార్టీగా బీఆర్​ఎస్ పేదల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ పలువురు నేతలు జనంలోకి వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీకి పట్టం కట్టి సంక్షేమ పథకాలను కొనసాగించాలని ఓటర్లను కోరుతున్నారు. రాష్ర్టంలో బీఆర్​ఎస్​ టికెట్​ ఆశిస్తున్న వారంత ఓటర్ల వద్ద కేసీఆర్, పార్టీని లేవనెత్తుతుంటే మంథని బీఆర్​ఎస్​ టికెట్​ ఆశిస్తున్న, ప్రస్తుత పెద్దపల్లి జెడ్పీ చైర్మన్​ పుట్ట మధు మాత్రం నియోజకవర్గంలో బహుజన రాగం వినిపిస్తున్నారు. ​పాల్గొన్న ప్రతి సమావేశంలో పార్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాల కంటే అగ్రవర్ణాల అధిపత్యానికి అడ్డుకట్టవేసి బహుజనులకు అధికారం ఇవ్వాలని కోరుతున్నారు. పుట్ట మధు బహుజన వాదానికి ప్రాధాన్యం ఇవ్వడం అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

బహుజన నినాదం..

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్​ టికెట్​ ఆశిస్తున్న మంత్రులు, సిట్టింగ్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు బీఆర్​ఎస్​ టికెట్​ ఆశిస్తున్న ప్రతి ఒక్కరూ 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు బీఆర్​ఎస్​ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో పార్టీని బలపరచాలని ఓటర్లను కోరుకుంటున్నారు. మంథని నియోజకవర్గంలో మాత్రం జెడ్పీ చైర్మన్​ మధు అందుకు భిన్నంగా బహుజనవాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. 2014లో మంథని నుంచి టీఆర్​ఎస్​ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పుట్ట మధు మంథని ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీ తరుపున పోటీ చేసిన మధు శ్రీధర్​‌బాబు చేతిలో ఓటమి చెందారు. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కమాన్​పూర్​ జెడ్పీటీసీగా గెలిచి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్​ అయ్యారు. ప్రస్తుతం పెద్దపల్లి జెడ్పీ చైర్మన్​గా ఉన్న పుట్ట మధు వచ్చే ఎన్నికల్లో మంథనినుంచి ఆ పార్టీ టికెట్​ ఆశిస్తున్నారు.

మహనీయుల విగ్రహాల ఏర్పాటు..

వచ్చే ఎన్నికల్లో మంథని టికెట్​ ఆశిస్తున్న పుట్ట మధు కొంతకాలంగా బహుజన వాదంతో ముందుకు సాగుతున్నారు. మంథని నియోజకవర్గం ఇప్పటికే సమాజానికి స్పూర్తిగా నిలిచిన పలువురి విగ్రహాలను ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తు వస్తున్నారు. దొడ్డి కొమురయ్య, కొమురంబీం, చాకలి అయిలమ్మ, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్​, కర్మచారి, బీపీ మండల్​, బాబు జగ్జీవన్​ రావు వంటి​ మహానీయుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించినా బహుజన వాదంతోనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. తక్కువ శాతం ఉన్న అగ్రవర్ణాల చేతిలో అధికారం ఉండడంతో బహుజనులను అణిచివేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. బహుజనులు ఐక్యంగా ఉండి అగ్రవర్ణాలను ఎందుర్కొని రాజ్యాధికారం సాధించాలని పిలుపునిస్తున్నారు.

నియోజకవర్గంలో హాట్ టాపిక్

ప్రస్తుత పెద్దపల్లి జెడ్పీ చైర్మన్​గా ఉన్న పుట్ట బీఆర్​ఎస్​ పార్టీలో కొనసాగుతున్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఆ పార్టీ ప్రభుత్వ పని తీరుతో పాటు కేసీఆర్​ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను వివరిస్తూ టికెట్​ ఆశిస్తున్న అభ్యర్థులు ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. మంథని నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యే శ్రీధర్​ బాబుతో పాటు శ్రీధర్​ బాబు తండ్రి శ్రీపాదరావు మంథని నుంచి అనేక సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించారు. నియోజకవర్గంలో నిర్వహించే ప్రతి మీటింగ్​లో అగ్ర కులాల అధిపత్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో మధు మాట్లాడుతున్నారు. పుట్ట మధు అనుసరిస్తున్న తీరు బీఆర్​ఎస్​ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. బీఆర్​ఎస్​ పార్టీ సైతం ఒక సామాజిక వర్గానికి చెందిన పార్టీగా ముద్ర పడిన నేపథ్యంలో మధు మాటలు మంథని నియోజకవర్గానికే పరిమితమా..? లేక రాష్ర్టంలో అగ్రవర్ణ కులాల అధిపత్యం తగ్గాలనేది మధు ఉద్దేశమా అనేది ప్రశ్నగా మారింది. ఇది ఇలా ఉంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్​ టికెట్​ రాకుంటే బహుజనవాదంతో మంథని ఎన్నికల బరిలో మధు నిలుస్తాడనే చర్చ జోరుగా సాగుతుంది.

Next Story

Most Viewed