Google Translateకి మరో అప్‌డేట్.. కొత్తగా 110 భాషలు

by Harish |
Google Translateకి మరో అప్‌డేట్.. కొత్తగా 110 భాషలు
X

దిశ, టెక్నాలజీ: దిగ్గజ కంపెనీ గూగల్ తన Google Translateకి మరో కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో ప్రస్తుతం ఉన్న భాషలకు అదనంగా మరికొన్ని భాషలను ట్రాన్స్‌లెట్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా 110 భాషలను గూగుల్ ట్రాన్స్‌లెట్‌కు ఇటీవల జోడించింది. ఇప్పటి వరకు 133 భాషలకు మాత్రమే ఈ ఆప్షన్ ఉండగా, ఇక మీదట మొత్తం 243 భాషలను ట్రాన్స్‌లెట్ చేస్తుంది. ఈ కొత్త భాషలను యాడ్ చేయడానికి కంపెనీ PalM 2 లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM)ని ఉపయోగించింది. నవంబర్ 2022లో గూగుల్ ఒక ప్రకటనలో, తన ట్రాన్స్‌లెటర్‌కు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడే 1,000 భాషలను సపోర్ట్ చేసేలా చూస్తామని ప్రకటించింది. ఇప్పుడు దానికి అనుగుణంగా భాషలకు సపోర్ట్ ఇచ్చేలా AI మోడల్‌లను రూపొందించడానికి ప్రయత్నాలు చేస్తుంది. కంపెనీ మొదటి దఫాలో 110 భాషలను యాడ్ చేసింది. వినియోగదారులకు వారి ప్రాంతాల ఆధారంగా పదాలను కచ్చితత్వంతో ట్రాన్స్‌లెట్ చేసేలా దీనికి అవసరమైన అన్ని టూల్స్‌ను అందించామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

Next Story

Most Viewed