నడిరోడ్డుపై మహిళలకు ఫ్లయింగ్ కిస్సులు.. హైదరాబాద్ లో యువకుల వీరంగం

by prasad |
నడిరోడ్డుపై మహిళలకు ఫ్లయింగ్ కిస్సులు.. హైదరాబాద్ లో యువకుల వీరంగం
X

దిశ, డైనమిక్ బ్యూరో: మద్యం మత్తులో యువకులు హల్ చల్ చేశారు. హైదరాబాద్ కేపీహెచ్ పీ మెట్రో స్టేషన్ సమీపంలో రోడ్డుపై వాహనాన్ని నిలిపి అటుగా వస్తున్న మహిళలు, యువతులకు ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ వీరంగం సృష్టించారు. ఫోర్ వీలర్ వాహనం పైకి ఎక్కి డ్యాన్సులు చేస్తూ హడలెత్తించారు. వీరి చేష్టలకు భయాందోళనకు గురైన మహిళలు పరుగులు పెట్టారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అక్కడి నుంచి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహిళలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి వారిని ఉపేక్షించవద్దని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed