కబ్జా రాయుళ్లను ఉపేక్షించేది లేదు : ఎమ్మెల్యే శ్రీ గణేష్

by Kalyani |
కబ్జా రాయుళ్లను ఉపేక్షించేది లేదు : ఎమ్మెల్యే శ్రీ గణేష్
X

దిశ, కంటోన్మెంట్ / బోయిన్ పల్లి: కంటోన్మెంట్ మొండా డివిజన్ పరిధిలోని ఎల్ శంకర్ నగర్ లో శుక్రవారం కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ పర్యటించారు. ఈ సందర్భంగా కొన్ని ఏళ్లుగా డ్రైనేజీ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్థానికులు తెలపడం తో డ్రైనేజీ సమస్యను పరిశీలించి అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. నాలా ప్రాంతాలను కబ్జా చేసే వారిపై చర్యలు తీసుకుంటామని, డ్రైనేజ్ సమస్య లేకుండా పూర్తిస్థాయిలో చర్యలు చేపడుతానని స్థానిక ప్రజలకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బస్తీవాసులు గిరిధర్, శంకరమ్మ, రాజన్న, పూలమ్మ, వెంకటలక్ష్మి తో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed