ప్రతిపక్ష నాయకుడే బలమైన ప్రజాస్వామ్య సాధనం: రాహుల్ గాంధీ

by Vinod |
ప్రతిపక్ష నాయకుడే బలమైన ప్రజాస్వామ్య సాధనం: రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా దేశ ప్రజల సమస్యలను వినిపిస్తానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. ‘ప్రతిపక్ష నేత అంటే ప్రతి భారతీయుడి వద్ద ఉన్న బలమైన ప్రజాస్వామ్య సాధనం. ఈ పాత్రను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తా. పార్లమెంటులో మీ సమస్యలను ఎప్పటికప్పుడు లేవనెత్తుతా’ అని తెలిపారు. ప్రతి సమస్యపై పోరాడతానని స్పష్టం చేశారు. రాహుల్ యువకులతో మాట్లాడిన వీడియోను కూడా షేర్ చేశారు. నీట్ పరీక్షను తిరిగి నిర్వహించాలని వారు రాహుల్‌కు సూచిస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లో ల్యాండ్‌మైన్ పేలుడులో విషాదకరంగా మరణించిన అగ్నివీర్ అజయ్ సింగ్ కుటుంబం, మణిపూర్‌లో హింసాకాండ బాధితులతో గాంధీ జరిపిన సమావేశాల క్లిప్‌లు కూడా ఇందులో ఉన్నాయి.

Next Story

Most Viewed