కొత్త హెడ్ కోచ్ అతనేనా?. బీసీసీఐ ప్రెసిడెంట్ ఏం చెప్పాడంటే?

by Harish |
కొత్త హెడ్ కోచ్ అతనేనా?. బీసీసీఐ ప్రెసిడెంట్ ఏం చెప్పాడంటే?
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. ద్రవిడ్ స్థానాన్ని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ భర్తీ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అతను బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ద్రవిడ్‌తోపాటు డబ్ల్యూవీ రామన్ కూడా పోటీలో ఉన్నాడు. హెడ్ కోచ్ నియామకంపై బీసీసీఐ త్వరలోనే ప్రకటన చేయనుంది. ఈ నేపథ్యంలో తాజాగా గంభీర్‌పై బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గంభీర్ టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా ఉండే భారత క్రికెట్‌కు మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. ‘గంభీర్‌కు చాలా అనుభవం ఉంది. భారత్‌కు కూడా కావాల్సింది అదే. అతను అన్ని ఫార్మాట్లలో ఆడాడు.’ అని తెలిపారు. అలాగే, కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్‌పై స్పందిస్తూ..‘వాళ్లిద్దరూ జట్టుకు ఎంతో సేవ చేశారు. వారిని భర్తీ చేయడం కష్టతరమైనది. ఐపీఎల్‌లో చాలా మంది ప్రతిభావంతులున్నారు. యువ క్రికెటర్లతో వారిని భర్తీ చేయాలనుకుంటున్నాం. ఇది అంత సులభం కాదు. కానీ, ప్రయత్నిస్తాం.’ అని చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed