భారత్‌లో అతిపెద్ద మ్యూజియం నిర్మాణం..కేంద్ర మంత్రి షెకావత్

by Vinod |
భారత్‌లో అతిపెద్ద మ్యూజియం నిర్మాణం..కేంద్ర మంత్రి షెకావత్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలోని రైసినా హిల్‌లోని నార్త్, సౌత్ బ్లాక్‌లను 2025 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియంగా అభివృద్ధి చేయనున్నట్టు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు. దీనికోసం ఫ్రాన్స్, భారత్ మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ లౌవ్రే కంటే దాదాపు రెట్టింపు పరిమాణంలో ఉంటుందని చెప్పారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారిగా ఆదివారం తన నియోజకవర్గమైన జోధ్‌పూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ముగిసి, 2025లో కార్యాలయాలు మారిన తర్వాత, నార్త్, సౌత్ బ్లాక్‌లు భారతదేశ 5,000 సంవత్సరాల చరిత్రను కళ్ల ముందు పెట్టే మ్యూజియంగా పునర్:నిర్మాణం అవుతుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం ప్రాజెక్ట్‌ను అమలు చేసే కార్యక్రమంలో భాగమవుతున్నందుకు గర్వంగా ఉందని తెలిపారు. భారత్ మొదటిసారిగా ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుందని వెల్లడించారు.

Next Story

Most Viewed