విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి : ఎమ్మెల్యే మేఘా రెడ్డి

by Kalyani |
విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి : ఎమ్మెల్యే మేఘా రెడ్డి
X

దిశ,వనపర్తి : ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని,ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల గ్రామ ప్రాథమిక పాఠశాలలో నిర్మించిన నూతన ఆదనపు గదిని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, పుస్తకాల పంపిణీలో, దుస్తుల పంపిణీలో, మధ్యాహ్న భోజనం ఏర్పాట్లలో ఎక్కడ ఎలాంటి నిర్లక్ష్యం వహించారాదని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యుగేందర్, ఎంఈఓ జయశంకర్ లను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘు ప్రసాద్ ,పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తూడి శ్రీనివాస్ రెడ్డి, అమ్మపల్లి మాజీ సర్పంచ్ రమేష్ యాదవ్, మాజీ ఎంపీటీసీ రామచంద్రయ్య గౌడ్, ఖిల్లాఘన్నపురం సింగిల్ విండో డైరెక్టర్ సాయి చరణ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి, మాజీ ఎంపీటీసీ చాపల సత్య రెడ్డి, మాజీ సర్పంచ్ వెల్టూరు శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మణిగిళ్ల తిరుపతిరెడ్డి, జయపాల్ రెడ్డి,రాఘవేందర్ శెట్టి, వెంకటరామిరెడ్డి, కొత్తకోట శేఖర్, డీలర్ శ్రీనివాస్, వివేక్, టైలర్ రవి రామాంజనేయులు, రాఘవేందర్, రామ్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed