బ్లాక్ స్పాట్ల వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పీ

by Sumithra |
బ్లాక్ స్పాట్ల వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పీ
X

దిశ, చిట్యాల : బ్లాక్ స్పాట్ల వద్ద రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసులు తగిన నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. గురువారం చిట్యాల పరిధిలోని జాతీయ రహదారి 65 ఉన్న బ్లాక్ స్పాట్లను సందర్శించి పరిశీలించారు. చిట్యాల పట్టణ కేంద్రంలోని రైల్వే స్టేషన్ కు వెళ్లే రహదారి క్రాసింగ్ వద్ద ఉన్న బ్లాక్ స్పాట్ లో తరచుగా ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని దానికి కారణం వాహనదారులు వ్యతిరేక దిశలో ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. అలా రాంగ్ రూట్లో ప్రయాణికులు వెళ్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. ఆయనతో పాటు స్థానిక ఎస్సై సైదాబాబు, సిబ్బంది ఉన్నారు.

Next Story

Most Viewed