ఆ విషయంలో తెలంగాణకు మొదటి స్థానం.. ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

by Indraja |   ( Updated:2024-07-07 10:43:45.0  )
ఆ విషయంలో తెలంగాణకు మొదటి స్థానం.. ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
X

దిశ వెబ్ డెస్క్: టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ పర్యటనలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న లావాదేవీల గురించి చర్చించినట్టు సమాచారం. కాగా నేడు చంద్రబాబు తెలంగాణ టీడీపీ శ్రేణులతో భేటీ అయ్యారు.

ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణపై ప్రశంసల జల్లు కురిపించారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉందని పేర్కొన్నారు. పెద్ద రాష్ట్రాలు అయిన గుజరాత్, మధ్యప్రదేశ్‌ను వెనకకు నెట్టి తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానానికి చేరుకుందని అభినంధించారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,08,732 కాగా ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ. 2,19,518 అని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed