- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PKL 2024 : బెంగాల్‌పై యు ముంబా విజయం.. తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు
దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. మంగళవారం బెంగాల్ వారియర్స్‌పై యు ముంబా నెగ్గి ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడంతో టైటాన్స్ రేసు నుంచి తప్పుకుంది. టోర్నీని 7వ స్థానంతో సరిపెట్టింది. టాప్-6 జట్లే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో యు ముంబా అద్భుత ప్రదర్శన చేసింది. 36-27 తేడాతో బెంగాల్‌ను ఓడించింది. మొదట నుంచి యు ముంబాదే ఆధిపత్యం. ఫస్టాఫ్‌లో ఆ జట్టు 18-10తో ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్‌లో బెంగాల్ నుంచి తీవ్ర పోటీ ఎదురైనప్పటికీ చివరి వరకూ లీడ్‌ను కాపాడుకుంది. ఆల్‌రౌండర్ అమీర్(7 పాయింట్లు), రైడర్ అజిత్(6), కెప్టెన్ సునీల్(5) రాణించి యు ముంబా విజయంలో కీలక పాత్ర పోషించారు. బెంగాల్ తరపున ప్రవీణ్(12), కెప్టెన్ నితీశ్(8) పోరాటం వృథా అయ్యింది. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్ 44-30 తేడాతో బెంగళూరు బుల్స్‌ను చిత్తు చేసింది. ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన చేసిన బెంగళూరు రెండే విజయాలు నమోదు చేసింది. ఓటమితోనే సీజన్‌ను ముగించింది. మరోవైపు, యూపీ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.