- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గౌరు తిరుపతి రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.. విద్యార్థి సంఘాలు..
దిశ, హనుమకొండ : గౌరు తిరుపతి రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. నెల్లికుదురు మండలం రాతిరం తండాకు చెందిన శ్రీదేవి హన్మకొండ డబ్బాల ప్రాంతంలో ఉన్న ఏకశిలా జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ( ఎంపీసీ ) చదువుతుంది. కాగా శ్రీదేవి మంగళవారం మధ్యాహ్నం కాలేజీ హాస్టల్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఏకశిలా కళాశాల ముందు అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అర్ధరాత్రి వరకు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఏకశిలా జూనియర్ కాలేజీ హనుమకొండ యూనివర్సిటీ డబ్బాల దగ్గర ఉన్న గర్ల్స్ క్యాంపస్లో గుగులోతు శ్రీదేవి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నదని తెలిపారు.
శ్రీదేశి యాజమాన్యం పెట్టే ఒత్తిడుల కారణంగానే కళాశాలలో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నదన్నారు. యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఎంజీఎం హాస్పటల్ కు పోస్టుమార్టం కోసం తరలించారు అంటూ ఏకాశిలా విద్యా సంస్థల చైర్మన్ గౌరీ తిరుపతి రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేశారన్నారు. ఇంటర్ బోర్డు నుండి ఎటువంటి పర్మిషన్ లేని గర్ల్స్ క్యాంపస్ ను సీజ్ చేసి కళాశాల గుర్తింపు రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యార్థి గుగులోత్ శ్రీదేవి కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ.. అర్థ రాత్రి కళాశాల ముందు నిరసన చేశారు. డీఈవో గోపాల్, హనుమకొండ జిల్లా కలెక్టర్, జిల్లా స్థానిక మంత్రులు, స్థానిక శాసన సభ్యులు చొరవ తీసుకుని విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి విద్యార్థి సంఘాల నాయకులు కోరారు.