Maternity leave : షాకింగ్.. మగ టీచర్‌కు మెటర్నిటీ లీవ్!

by Y. Venkata Narasimha Reddy |
Maternity leave : షాకింగ్.. మగ టీచర్‌కు మెటర్నిటీ లీవ్!
X

దిశ, వెబ్ డెస్క్ : మహిళా టీచర్ల(Womens Teachers)కు మంజూరు చేసే ప్రసూతి సెలవులు(Maternity leaves) పురుష టీచర్(Male Teacher)కు మంజూరైన ఘటన వైరల్ గా మారింది. బీహార్ రాష్ట్రం వైశాలి జిల్లాకు చెందిన జితేంద్ర కుమార్ సింగ్ అనే టీచర్ సెలవుల కోసం దరఖాస్తు చేస్తున్నాడు. చిత్రంగా ఆయనకు 8 రోజుల పాటు మెటర్నిటీ సెలవులు మంజూరయ్యాయి. మంజూరైన సెలవులు వృధా చేసుకోవడం ఎందుకని జితేంద్ర కుమార్ మెటర్నటీ సెలవులను వాడేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విచిత్రమైన అసాధారణ సెలవుల అంశం వెలుగులోకి వచ్చింది. విచిత్రంగా మగ ఉపాధ్యాయుడికి ప్రసూతి సెలవు మంజూరు చేయడం ఏమిటి? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విద్యాశాఖ తీరును ఆక్షేపిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

విషయం ఆలస్యంగా తెలుసుకున్న వైశాలి జిల్లాలోని మహువా బ్లాక్‌ ఇంచార్జి విద్యా అధికారి అర్చన కుమారి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఆన్‌లైన్‌లో సెలవు కోసం దరఖాస్తు చేసుకునే ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేసిన పోర్టల్‌లో తప్పులతో ఈ ఘటన జరిగినట్లుగా ఆమె వెల్లడించారు. సెలవు దరఖాస్తు ఫార్మాట్‌లో తప్పుగా నమోదు చేసిన సాంకేతిక లోపంతో జితేంద్ర కుమార్ సింగ్ కు మెటర్నటీ సెలవులు మంజూరైనట్లుగా తెలిపారు. అన్‌లైన్ పోర్టర్‌ను సరి చేస్తున్నామని చెప్పారు. ప్రసూతి సెలవులు మహిళలకు మాత్రమే మంజూరు చేయబడతాయని ఆమె స్పష్టం చేశారు. అయితే "పురుషులు కూడా తమ నవజాత శిశువులను చూసుకోవడానికి 'పితృత్వ సెలవులు పొందవచ్చని గుర్తు చేశారు. అయితే జితేంద్రకుమార్ కు మెటర్నటీ సెలవుల మంజూరైన తీరుపై సాంకేతిక లోపాలను సరిచేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Next Story

Most Viewed