Banjara Hills Police: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి BIG షాక్

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-25 07:29:56.0  )
Banjara Hills Police: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి BIG షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)కి బంజారాహిల్స్ పోలీసులు(Banjara Hills Police) షాకిచ్చారు. బంజారాహిల్స్ సీఐ(Banjara Hills CI) విధులకు ఆటంకం కలిగించి.. దురుసుగా ప్రవర్తించిన కేసులో బుధవారం మధ్యాహ్నం నోటీసులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 10:00 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే కౌశిక్ రెడ్డి ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ తిరిగి ఇచ్చేయాలని పోలీసులకు తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ఆదేశాలు సైతం జారీ చేసింది. నిబంధనల ప్రకారం.. నోటీసులు ఇవ్వకుండా ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడానికి వీలు లేదని హైకోర్టు పేర్కొంది. దీనికి ప్రభుత్వ తరపు న్యాయవాది స్పందిస్తూ.. దర్యాప్తులో భాగంగా ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన కుట్రలు పన్నుతున్నారని వాదించారు. ఈ మొబైల్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.

Advertisement
Next Story

Most Viewed