Surya 44: ‘సూర్య44’ టైటిల్ ఫిక్స్.. లవ్‌తో పాటు యాక్షన్ కూడా

by sudharani |
Surya 44: ‘సూర్య44’ టైటిల్ ఫిక్స్.. లవ్‌తో పాటు యాక్షన్ కూడా
X

దిశ, సినిమా: రీసెంట్‌గా ‘కంగువ’ (Kanguva) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో సూర్య (surya) ప్రస్తుతం ‘సూర్య44’ (Surya 44)తో బిజీగా ఉన్నాడు. ఇందులో పూజా హెగ్దే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తుంది. కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని 2D ఎంటర్‌టైన్‌మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిలింమ్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి సూర్య-44 టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం.

టీజర్ (teaser) స్టాటింగ్‌లో ఓ టెంపుల్‌లో పూజా హెగ్దే, సూర్య కూర్చుని మాట్లాడుకుంటారు. సూర్య ‘నాది స్వచ్ఛమైన ప్రేమ’ అని హీరోయిన్‌తో చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక యాక్షన్ (action) సన్నివేశాలతో పవర్ ఫుల్‌గా సాగిన ఈ టీజర్‌లో సినిమా టైటిల్ ‘రెట్రో’ (Retro)గా రివీల్ చేశారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన టీజర్‌తో పాటు, పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది.

Next Story

Most Viewed