రాజ్ తరుణ్‌‌ చాలా మందితో ఎఫైర్ పెట్టుకున్నాడు.. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి.. లావణ్య సంచలన కామెంట్స్!

by Hamsa |   ( Updated:2024-07-07 11:00:48.0  )
రాజ్ తరుణ్‌‌ చాలా మందితో ఎఫైర్ పెట్టుకున్నాడు.. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి.. లావణ్య సంచలన కామెంట్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం గత రెండు రోజుల నుంచి సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ యంగ్ హీరో తనతో ప్రేమాయణం నడిపి పెళ్లి చేసుకొని మోసం చేశాడంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయాలు బయటకు వచ్చాయి. తాను హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో రిలేషన్ పెట్టుకుని మోసం చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఈ కేటాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం గత రెండు రోజుల నుంచి సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.పై రాజ్ తరుణ్ మాట్లాడి క్లారిటీ ఇచ్చాడు. లావణ్య, మస్తాన్ అనే వ్యక్తితో ప్రేమలో ఉందన్న విషయం తెలియడంతోనే 2017 నుండే దూరం ఉంటున్నా ఆమె నాపై చేస్తున్న కామెంట్స్‌లో ఎలాంటి నిజం లేదని వెల్లడించాడు. దీంతో లావణ్యకు పోలీసులు రివర్స్ నోటీసులు జారీ చేయడంతో ఆమె పారిపోయింది. ఈ క్రమంలో.. మాల్వి కూడా స్పందించి.. తనకు అసలు లావణ్య ఎవరో తెలియదు అని రాజ్ తరుణ్ కోస్టార్ మాత్రమేనని చెప్పుకొచ్చింది. దీంతో అంతా రాజ్ తరుణ్ తప్పు లేదు ఆమెనే డబ్బుల కోసం చేసిందని భావించారు. ఇంతటితో రాజ్, లావణ్య కథ సుఖాంతం అయిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు.

తాజాగా, లావణ్య మీడియా ముందుకు వచ్చి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘ 2017 నుంచి దూరం అయ్యాడని చెప్పాడు కానీ అందులో నిజం లేదు. మా పెళ్లి జరిగిన విషయం వాళ్ల తల్లిదండ్రులకు కూడా తెలుసు. ప్రతి వినాయక చవితికి నా ఫ్యామిలీతో పాటు అతని కుటుంబం కూడా కలుస్తుంది. రాజ్ తరుణ్ చాలా మంది అమ్మాయిలతో ఎఫైర్ పెట్టుకున్నాడని తెలిసింది. కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ నాకు అతనే కావాలి. రాజ్ లేకపోతే బతకలేను. నన్ను అన్ని రకాలుగా వాడుకుని మాల్విని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. మాల్వి అన్న చంపుతా అని బెదిరిస్తున్నాడు. నాకు ప్రాణ భయం ఉంది. అన్ని ఆధారాలు కూడా పోలీసులకు అందించాను. లవర్ సినిమా నుంచి మాకు గొడవలు మొదలయ్యాయి. మా విషయం గురించి రాజా రవీంద్ర గారికి తెలుసు.

అయితే ఇదంతా జరుగుతుందని రాజ్ వాళ్ల తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదు. మాకు చెప్పి మీరు పెళ్లి చేసుకోలేదు కదా అతనికి ఓకే అయితే మాదేం లేదు అంటున్నారు. రాజ్ నాతో ఇంట్లో గొడ్డు చాకిరి చేయించాడు. అతని కోసం భరించాను. అసలు కేసు పెట్టాలని అనుకోలేదు కానీ మాల్వీ వల్లనే అలా చేశాను. ఇవన్నీ చేయడం వల్ల రాజ్‌కు కోపం రావొచ్చు కాబట్టి క్షమించమని అడుగుతాను. మాల్వికి గెట్ లాస్ట్ మా లైఫ్‌ల నుంచి వెల్లిపోమంటాను. రాజ్ చెప్తున్నట్లుగా మస్తాన్ ‌కు నాకు ప్రేమాయణం లేదు. వరలక్ష్మి టిఫిన్ డ్రగ్ కేసులో అతను నిందితుడు. నాకు మ్యూచువల్ ఫ్రెండ్ అంతే ఆ కేసు గురించే మాట్లాడుతాను ’’ అని చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed