- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ హయాంలో రైతుల పరిస్థితి ఇదే.. రైతు ఆత్మహత్యపై రాజాసింగ్ హాట్ కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో: ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామంలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్న వీడియో కలకలం రేపుతోంది. కొందరూ తన భూమిని ఆక్రమించారని బాధిత రైతు ఆరోపించారు. దీంతో తనకు న్యాయం జరగదని భావించి పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ రైతు ఆత్మహత్యపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ట్విట్టర్ వేదికగా రైతు వీడియో పోస్ట్ చేశారు.
‘తెలంగాణాలో ఒక రైతు తన 3 ఎకరాల భూమిని కాంగ్రెస్ నాయకులు ఆక్రమించారని, అతనికి పరిపాలన నుంచి ఎటువంటి సహాయం అందలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. కాంగ్రెస్ హయాంలో రైతుల పరిస్థితి ఇదే. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న కాంగ్రెస్ నాయకులపై విచారణ ప్రారంభించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేస్తూ డిమాండ్ చేశారు.