- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం.. ఇక నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులు ఆన్ లైన్లో స్వీకరణ
![సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం.. ఇక నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులు ఆన్ లైన్లో స్వీకరణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం.. ఇక నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులు ఆన్ లైన్లో స్వీకరణ](https://www.dishadaily.com/h-upload/2024/07/02/348314-cm-relefe-fund.webp)
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను ఇక నుంచి ఆన్లైన్లో స్వీకరించనున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్సైట్ https//cmrf.telangana.gov.in- ను సీఎం ఈ రోజు సచివాలయంలో ప్రారంభించారు. సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను ఈ నెల 15 తర్వాత నుంచి ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తారు. సీఎంఆర్ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలు తీసుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ సిఫార్సు లేఖను జత చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ లో సంబంధింత దరఖాస్తుదారుడి బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి. అప్లోడ్ చేసిన తర్వాత సీఎంఆర్ఎఫ్ కు సంబంధించిన ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ను సంబంధిత ఆస్పత్రులకు పంపించి నిర్ధారించుకుంటారు.