త్రీడీలో మోడీతో సెల్పీలు- కొత్త పుంతలు తొక్కనున్న ‘పరీక్షా పే చర్చ’

by Shamantha N |
త్రీడీలో మోడీతో సెల్పీలు- కొత్త పుంతలు తొక్కనున్న ‘పరీక్షా పే చర్చ’
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రతి సంవత్సరం వార్షిక పరీక్షల టైంలో దేశంలోని విద్యార్థి లోకాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగించే కార్యక్రమం ‘పరీక్షా పే చర్చ’. ఈ ప్రోగ్రాంను కొత్త పుంతలు తొక్కించే దిశగా కసరత్తు జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగించేటప్పుడు 2డీ, 3డీలో కనిపించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ దిశగా ఏర్పాట్లు చేసే సామర్థ్యం కలిగిన టెక్ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించబోతున్నారు. పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని వర్చువల్ మోడ్‌లోకి మార్చే బాధ్యతను నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)కు అప్పగించారు. ఈ అప్‌గ్రేడ్ జరిగాక.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వర్చువల్ మోడ్‌లో పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులకు ప్రధాని మోడీ 2డీ లేదా 3డీలో కనిపిస్తారు. విద్యార్థులు నేరుగా వేదికపైకి వెళ్లి ప్రధాని మోడీ 3డీ లైవ్ ఇమేజ్ పక్కన నిలబడి సెల్ఫీలు దిగే వీలు ఉంటుంది. ఇందుకోసం వేదికపై ప్రత్యేకంగా సెల్ఫీ జోన్‌ను క్రియేట్ చేయనున్నారు.

Next Story

Most Viewed